ఆసీస్ జట్టులో భారీ మార్పులు! | Crisis hit Australia make six changes | Sakshi
Sakshi News home page

ఆసీస్ జట్టులో భారీ మార్పులు!

Published Sun, Nov 20 2016 2:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

ఆసీస్ జట్టులో  భారీ మార్పులు!

ఆసీస్ జట్టులో భారీ మార్పులు!

అడిలైడ్: వరుసగా ఐదు టెస్టు మ్యాచ్ల్లో ఓటమి. దక్షిణాఫ్రికాపై తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభవం ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులకు తావిచ్చింది. ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ చెప్పినట్లుగానే కొంతమంది కీలక ఆటగాళ్లపై వేటు పడింది. ఈ క్రమంలోనే ఆరుగురు ఆటగాళ్లకు స్థానం కల్పిస్తూ సెలకర్టు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు ఆదివారం విడుదల చేసిన 12 మందితో కూడిన ఆసీస్ క్రికెటర్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది.

 

ఇందులో క్వీన్లాండ్ ఓపెనర్ రెన్ షాకు అవకాశం కల్పించగా, మరో ఇద్దరు బ్యాట్స్మెన్లు పీటర్ హ్యండ్స్ కాంబ్, నిక్ మేడిన్సన్లకు చోటు దక్కింది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చాడ్ సయ్యర్స్ చోటు లభించగా, మరో బౌలర్ జాక్సన్ బర్డ్ కు తిరిగి చోటు కల్పించింది. ఇదిలా ఉండగా, వికెట్ కీపర్గా మాథ్యూ వేడ్ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. ఇదిలా ఉండగా,దక్షిణాఫ్రికాతో జరిగిన హోబార్ట్ టెస్టులో ఆడి ఆసీస్ ఘోర ఓటమికి కారణమైన జో బర్న్స్,ఆడమ్ వోజస్, కాలమ్ ఫెర్గ్యూసన్, నేవిల్పై వేటు వేశారు.  ఇలా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరు మార్పులను చేయడం 1984 తరువాత ఇదే తొలిసారి. అప్పుడు వెస్టిండీస్ తో వైఫల్యం చెందిన సందర్భంలో ఆసీస్ జట్టులో ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి.

తదుపరి ఆసీస్ జట్టు ఇదే..

స్టీవ్ స్మిత్(కెప్టెన్), జాక్సన్ బర్డ్, పీటర్ హ్యాండ్ స్కాంబ్, హజల్ వుడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, నిక్ మాడిన్ సన్, మ్యాట్ రెన్ షా, చద్ సయ్యర్స్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడు, డేవిడ్ వార్నర్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement