Aakash Chopra Picks Team India Test Squad For SA Tour.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకొని జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికా టూర్‌కు బయల్దేరనుంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆలస్యంగా ప్రారంభం కానున్న టూర్‌లో ఇరుజట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సౌతాఫ్రికా పర్యనటకు వెళ్లనున్న టీమిండియా జట్టును ప్రకటించనుంది. కివీస్‌తో సిరీస్ ఆడిన టీమిండియా జట్టునే దాదాపు కొనసాగించనుంది. అయితే ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న రహానేకు మరో అవకాశం ఇస్తుందో లేదో వేచిచూడాలి. గాయంతో బాధపడుతున్న శుబ్‌మన్ గిల్ పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు.
చదవండి: టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. కొత్త షెడ్యూల్ ఇదే
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా టెస్టు జట్టును ఎంపికచేశాడు. 15 మందితో కూడిన జట్టులో 11 మందిని తుది జట్టుగా ఎంపికచేసి.. మిగతా నలుగురిని రిజర్వ్‌గా ఎంపికచేశాడు. జట్టు విషయానికి వస్తే.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఇక వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా.. నాలుగో స్థానంలో కోహ్లి.. ఐదో స్థానంలో రహానేకు బదులు శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపికచేశాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చిన చోప్రా.. ఆల్‌రౌండర్లుగా జడేజా, అశ్విన్‌లకు చోటు కల్పించాడు. ఇక పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎంపిక చేశాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఇక ఈ జాబితాలో అజింక్యా రహానే, గిల్‌లకు చోటు దక్కలేదు.
చదవండి: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్!
ఆకాశ్ చోప్రా టీమిండియా టెస్టు జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment