
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చిత్రపరిశ్రమకు ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. 25 శాతం సినిమాలను ఏపీలో చిత్రీకరించేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. బీచ్‌రోడ్డులో ఆదివారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ థ్యాంక్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. నెల వ్యవధిలో అన్నదమ్ముల సినిమాలు రిలీజై హిట్ అవ్వడం గొప్ప విషయమన్నారు.
ఇక హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తన కెరీర్ ఓ మైలు రాయిగా నిలిచిపోయిందన్నారు. ఇంతటి ఘనవిజయం అందజేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వంద శాతం థియేటర్ల సీట్లు అమ్మకాలకు అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వైజాగ్‌కు మళ్లీ వస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, నటీనటులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment