
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. పూజా హేగ్డే హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందుతోంది. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ లెహరాయి ప్రోమో విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో అఖిల్, పూజ రొమాన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment