'ఏ జిందగీ' వచ్చేస్తోంది.. | Most Eligible Bachelor song Ye Zindagi song on Released on 5th April | Sakshi
Sakshi News home page

'ఏ జిందగీ' వచ్చేస్తోంది..

Published Thu, Apr 1 2021 12:47 AM | Last Updated on Thu, Apr 1 2021 1:19 AM

Most Eligible Bachelor song Ye Zindagi song on Released on 5th April - Sakshi

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్‌ 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా ఈ చిత్రంలో ‘ఏ జిందగీ..’ అంటూ సాగే పాటని ఈ నెల 5న విడుదల చేయనున్నారు. ‘‘రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.

ప్రారంభం నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. గోపీ సుందర్‌ సంగీతం అందించగా, సి«ద్‌ శ్రీరామ్‌ పాడిన ‘మనసా మనసా..’ పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్‌కు సోషల్‌ మీడియాలో, అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఆమని, మురళీ శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీశ్‌ ఎమ్‌ వర్మ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement