
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత, దర్శకుడ వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో అఖిల్, పూజా హెగ్డే జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లైఫ్ పార్ట్‌నర్ గురించి పూజా చెప్పే డైలాగ్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇలా లవ్, కామెడీ అంశాలతో ట్రైలర్ ఆసక్తిగా మలిచారు మేకర్స్.
చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబూ మోహన్
‘మన లైఫ్ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అంతకు మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని అంటూ పూజా ఇచ్చే స్పీచ్‌లు..పెళ్లి చూపుల్లో అమ్మాయిలతో ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి’ అంటూ అఖిల్ తన అభిప్రాయాన్ని చెబుతుండగా వారి మధ్య జరిగే సన్నివేశాలు మూవీపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి హీరోహీరోయిన్లు చెప్పే పెళ్లి ముచ్చట్లు బాగా అలరిస్తున్నాయి. ఇక పూజా, అఖిల్ మధ్య రొమాన్స్ అయితే మాములుగా లేదు.
Comments
Please login to add a commentAdd a comment