థియేటర్లను పూర్తి సామర్థ్యంతో నడపవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చిన తరుణంలో సినీ పరిశ్రమకు ఊరట లభించినట్లైంది. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తాజాగా అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించింది. జూన్ 19న థియేటర్లలో సందడి చేస్తున్నట్లు వెల్లడించింది. నిజానికి సంక్రాంతికే సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. (చదవండి: నాకు కాబోయేవాడు నా షూతో సమానం)
కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జూన్‌కు వాయిదా వేసుకోక తప్పలేదు. అదే నెలలో మెగా ఫ్యామిలీ నుంచి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' చిత్రం జూన్ 4న రిలీజ్ అవుతోంది. దీనికి అక్కినేని అఖిల్ సినిమాకు మధ్య 15 రోజులు గ్యాప్ ఉండటంతో వసూళ్లపరంగా పెద్ద ఇబ్బందేమీ ఉండనట్లు కనిపిస్తోంది. అసలే వరుసగా మూడు పరాజయాలు వెంటాడుతున్న అఖిల్ ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందేనని గట్టిగా ఫిక్సయ్యాడు. మరి అతడి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు.
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన టీజర్ అభిమానులను విశేషంగా ఆకర్షించిన విషయం తెలిసిందే.ఇదిలా వుంటే అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు. తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శకద్వయం రాజ్, డీకేలతో మరో సినిమా చేయనున్నాడు. దీన్ని అశ్విని దత్ నిర్మించనున్నాడు. (చదవండి: మరిది కోసం రంగంలోకి దిగిన సామ్)
Comments
Please login to add a commentAdd a comment