మెలోడియస్‌ ‘ఏ జిందగీ’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌..‌ | Most Eligible Bachelor Ye Zindagi Song Released | Sakshi
Sakshi News home page

'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'‌ మెలోడీ సాంగ్‌ విన్నారా?

Published Mon, Apr 5 2021 7:18 PM | Last Updated on Mon, Apr 5 2021 8:45 PM

Most Eligible Bachelor Ye Zindagi Song Released - Sakshi

యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏ జిందగీ’ అంటూ ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 'ఆకాశ‌మంతా ఆనంద‌మై తెల్లారుతోందే నాకోస‌మై..ఆలోచ‌నంతా ఆరాటమై..అన్వేషిస్తోందే'.. ఈ రోజుకై అంటూ సాగే ఈ మెలోడియస్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది.

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను హ‌నియా న‌ఫీసా‌, గోపీసుంద‌ర్ పాడారు.  గోపీ సుందర్‌ ఈ సాంగ్‌ను కంపోజ్‌ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ప్రస్తుతం షరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌19న విడుదల కానుంది. చాన్నాళ్లుగా హిట్‌ కోసం ఆరాటపడుతున్న అఖిల్‌కు ఈ సినిమాతో అయినా హిట్‌ ఖాతాలో పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : అఖిల్‌ మూవీ పై నాగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌
ఆ స్టార్‌ డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement