అఖిల్‌ సినిమా..! సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన ఫ్యాన్‌..! | Akhil Fan Ayyagare No 1 Rampage On Social Media | Sakshi
Sakshi News home page

#ayyagareno1: అఖిల్‌ సినిమా..! సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన ఫ్యాన్‌..!

Published Sat, Oct 16 2021 6:11 PM | Last Updated on Sat, Oct 16 2021 8:59 PM

Akhil Fan Ayyagare No 1 Rampage On Social Media - Sakshi

ఓ థియేటర్‌ వద్ద మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ కటౌంట్‌కు కొబ్బరి కాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక.. వాడే గొప్ప...పులీ..పులీ...కింగ్‌ కొడుకు.. అంటూ కేకలు వేశాడు.

ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన అఖిల్‌ అక్కినేని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో హిట్‌ కొట్టేశాడు. ప్రేక్షకులముందుకొచ్చిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ దసరా విన్నర్‌గా నిలిచింది. తొలిరోజే హిట్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టిగ్‌ లవ్‌స్టోరీతో మోస్ట్‌ ఎలిజిబుల్‌ హిట్‌ టాక్‌ను సినిమా సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్‌ రోజు సోషల్‌ మీడియాలో అఖిల్‌ పేరు కంటే అఖిల్‌ వీరాభిమాని​ అయ్యగారి ఫ్యాన్‌ పేరే ఎక్కువగా వినిపించింది. 

ఫ్యాన్‌కు ఫ్యాన్‌బేస్‌ మామూలుగా లేదు...!
కొంతమంది ప్రేక్షకులు అఖిల్‌ సినిమా కోసం ఎదురచూడగా.... మరి కొంత మంది ఫ్యాన్స్‌ మాత్రం అఖిల్‌ హర్డ్‌ కోర్‌ ఫ్యాన్‌​ ఎప్పుడూ వస్తాడనే కళ్లు కాయేలా కాసేలా ఎదురుచూశారు. సోషల్‌మీడియాలో అఖిల్‌ ఫ్యాన్‌కు ఫ్యాన్‌బేస్‌ను చూసి యూజర్లు నివ్వెర పోయారు. అయ‍్యగారి ఫ్యాన్‌..‘ఓ థియేటర్‌ వద్ద మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ కటౌంట్‌కు కొబ్బరి కాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక.. వాడే గొప్ప...పులీ..పులీ...కింగ్‌ కొడుకు.. అంటూ కేకలు వేశాడు. అయ్యగారి ఫ్యాన్‌ ఉత్సాహంతో ఇతర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. సోషల్‌మీడియాలో  #ayyagareno1 అంటూ హ్యాష్‌టాగ్‌ ట్రెండ్‌ అయ్యింది.


చదవండి:బొమ్మ‌రిల్లును గుర్తు చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement