Trisha Krishnan Gets Emotional: సినీ ప్రపంచంలో తారలకు అభిమానులకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే కొందరు నటులకు వారి కెరీర్‌లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకుంటారు. అలాగే తమ హీరో, హీరోయిన్ కోసం ఏం చేయడానికైనా ఆ అభిమానులు రెడీగా ఉంటారు. ఈ క్రమంలో తారలు కూడా అంతే తమ ఫ్యాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అంతెందుకు ఒక్కోసారి తమ అభిమానులను బాధపెట్టే నిర్ణయాలు కూడా తీసుకోరు. ( చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ )
అంతటి బంధం ఉన్నా.. ఒకప్పుడు సినీ తారలను ఫ్యాన్స్ కలవాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు పడేవాళ్లు. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో స్టార్స్, ఫ్యాన్స్ మధ్య దూరం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నేరుగా మాట్లాడుకోవడం, చాట్ చేయడం సులువుగానే జరుగుతున్నాయి. తాజాగా తన అభిమాని గురించి త్రిష చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘గుండె బద్దలైంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర’
ఇటీవల త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మరణించాడు. అతను త్రిష ఫ్యాన్ ట్విటర్ అకౌంట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడట. అలానే త్రిష అభిమానులను అందరినీ ఒక్క చోటకు తీసుకొచ్చాడట. అలాంటి వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది. ఈ విషయంపై స్పందిస్తూ త్రిష ట్వీటర్‌లో.. తన గుండె బద్దలైందన్నట్టుగా చెబుతూ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన త్రిష తమిళంలో 96 సినిమాతో మంచి హిట్‌నే అందుకుంది. కానీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు.
I am so devastated about this💔 Rip my brother and thank you for being you. https://t.co/OUiTSXXtco
— Trish (@trishtrashers) November 14, 2021
చదవండి: Tollywood Comedians: ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment