‘అయ్యగారి ఫ్యాన్‌’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్‌ | Akhil Akkineni Reaction on His Die Hard Fan | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: ‘అయ్యగారి ఫ్యాన్‌’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్‌

Published Mon, Oct 18 2021 8:59 PM | Last Updated on Mon, Oct 18 2021 9:17 PM

Akhil Akkineni Reaction on His Die Hard Fan - Sakshi

అఖిల్‌ అక్కినేని కొత్త మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొ​ట్టాడు అక్కినేని వారసుడు.  అయితే సినిమా రిలీజ్‌ రోజు సోషల్‌ మీడియాలో అఖిల్‌ పేరు కంటే ఎక్కువగా వినిపించిన అఖిల్‌ వీరాభిమాని​ ‘అయ్యగారి ఫ్యాన్‌’ గురించి తెలిసిందే. తాజాగా తన ఫ్యాన్‌పై స్పందించాడు ఈ కుర్ర హీరో.


తన కొత్త చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మంచి రెస్పాన్స్‌ అందుకుంటున్న తరుణంలో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు అఖిల్‌. అందులో ఓ అభిమాని ‘అయ్యగారి అభిమాని’ గురించి అడిగాడు. దీనిపై స్పందించిన ఈ కుర్ర హీరో.. ‘అతని గురించి నాకు తెలుసు. నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్‌ అయ్యిండొచ్చు. బ్రదర్‌ నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు.

చదవండి: అఖిల్‌ సినిమా..! సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన ఫ్యాన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement