
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. గతవారం విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరుణంలో మూవీ టీం హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రెషన్స్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ హాజరయ్యాడు.
అల్లు అర్జున్ ఈ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతూ..‘పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు. ఆమె అందరి హీరోలకి స్పెషలే’ అని తెలిపాడు. అంతేకాకుండా.. ‘ముకుంద మూవీ నుంచి పూజాని చూస్తున్నా. ప్రతి సినిమాలో తనదైన శైలిలో వైవిధ్యమైన నటనని ప్రదర్శిస్తోంది. ఆమె ఎవరితో నటించిన ఆ హీరో హిట్ అందుకుంటాడ’ని ఐకాన్ స్టార్ చెప్పాడు. కాగా ఈ స్టైలిష్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలు రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment