ప్రయాణం మొదలు | akhil new movie shooting starts from june 26 | Sakshi
Sakshi News home page

ప్రయాణం మొదలు

Published Tue, Jun 18 2019 2:33 AM | Last Updated on Tue, Jun 18 2019 5:03 AM

akhil new movie shooting starts from june 26 - Sakshi

అఖిల్‌ తన కొత్త ప్రయాణాన్ని ఈ నెల 26 నుంచి మొదలుపెట్టనున్నారని తెలిసింది. మరి ఈ ప్రయాణం ఎందాకా? ఎలా సాగుతుంది? అనేది తెలియాలంటే ఇంకా చాలా టైమ్‌ పడుతుంది.  ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేయనున్న సంగతి తెలిసిందే. జీఎ2 బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అఖిల్‌తో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారో ఇంకా నిశ్చయించలేదు. ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 26న రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం హైదరాబాద్‌లో జర గనుంది. కొంత పోర్షన్‌ను రెండు దేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. అవేంటో ఇంకా ఫిక్స్‌ చేయలేదు. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement