ఖుషీ ఖుషీ స్టెప్స్‌ | akhil with pooja hegde movie song shooting at hyderabad | Sakshi
Sakshi News home page

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

Published Sun, Dec 8 2019 12:20 AM | Last Updated on Sun, Dec 8 2019 12:20 AM

akhil with pooja hegde movie song shooting at hyderabad - Sakshi

పూజా హెగ్డే, అఖిల్

హైదరాబాద్‌లో స్టెప్స్‌ వేస్తున్నారు అఖిల్‌. తనతో పాటు హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా కాలు కదుపుతున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నది సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాట అని తెలిసింది. పూజాతో కలసి ఖుషీ ఖుషీగా స్టెప్స్‌ వేస్తున్నారట అఖిల్‌. ఈ పాటకు రఘు మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం దర్శకుడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement