అఖిల్‌కు జోడీగా కియారా? | Kiara Advani to Romance Akhil Akkineni | Sakshi
Sakshi News home page

అఖిల్‌కు జోడీగా కియారా?

Published Fri, Apr 19 2019 2:24 PM | Last Updated on Fri, Apr 19 2019 2:42 PM

Kiara Advani to Romance Akhil Akkineni - Sakshi

అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్. భారీ అంచనాల మధ్య పరిచయం అయిన అఖిల్ ఇప్పటివరకు ఆ అంచనాలను అందుకో లేకపోయాడు. అందుకే ఇప్పటికే అఖిల్‌కు సక్సెస్‌ఇచ్చే బాధ్యతను మెగా నిర్మాత  అల్లు అరవింద్ తీసుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అఖిల్ నాలుగో సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చివరిదశకు చేరుకోగా అఖిల్‌కు జోడిగా భరత్‌ అనే నేను ఫేం కియారా అ‍ద్వానినీ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ భామ అఖిల్ సరసన నటించేందుకు ఓకె చెపుతుందో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement