కొత్త సినిమా లాంఛ్‌, గెస్టులుగా సుద్దాల అశోక్‌ తేజ, బొమ్మరిల్లు భాస్కర్‌ | Sahasra Entertainment Production Number One New Movie Launched | Sakshi
Sakshi News home page

విశ్వంత్‌ హీరోగా కొత్త సినిమా షురూ..

Published Thu, Nov 10 2022 8:35 PM | Last Updated on Thu, Nov 10 2022 9:18 PM

Sahasra Entertainment Production Number One New Movie Launched - Sakshi

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా  తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్‌ చేయనున్నారు.

చదవండి: బికినీలో నిహారిక, ఫొటోలు వైరల్‌
రేవంత్‌కు శ్రీహాన్‌ వెన్నుపోటు పొడిచాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement