అల్లు అర్జున్
‘మనం’ సినిమా కథ చెప్పి, ఒప్పించడం కష్టం. పోనీ ‘24’ సినిమా కథ? మళ్లీ అదే పరిస్థితి. ఇలా.. చెప్పుకోవడానికి చాలా క్లిష్టంగా చూడటానికి చాలా క్లియర్‌గా ఉంటాయి దర్శకుడు విక్రమ్‌కుమార్ సినిమా కథలు. ఈసారి కూడా ఆడియన్స్‌కు ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా చెప్పడానికే రెడీ అవుతున్నారట విక్రమ్ కుమార్. అల్లు అర్జున్ హీరోగా విక్రమ్‌కుమార్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్‌గా షికారు చేస్తున్న పుకారు ఏంటంటే ఈ సినిమా కథ పునర్జన్మల నేప«థ్యంలో సాగనుందని. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కొంచెం టైమ్ తీసుకున్నారు అల్లు అర్జున్. విక్రమ్‌కుమార్ చెప్పిన ఈ పాయింట్ బన్నీని చాలా ఎగై్జట్ చేసిందని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment