
అల్లు అరవింద్
" నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయ్యింది. మా నాన్నగారు అల్లు రామలింగయ్య, ఆ తర్వాతి తరంలో నేను, చిరంజీవి, ఆ తర్వాతి తరంలో పవన్ కల్యాణ్ నుంచి.. చిత్ర పరిశ్రమలో ఉన్న మాకు ఇండస్ట్రీ అంటే భక్తి, గౌరవం. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న బాధాకరమైన విషయాలు మీకు తెలిసినవే. శ్రీరెడ్డిగారు తీసుకొచ్చిన కొన్ని విషయాలపై ఫిల్మ్‌చాంబర్‌లో జరిగిన మీటింగ్స్‌లో ఒక్కదానిలో తప్ప అన్నింటిలో నేనూ ఉన్నా. లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఓ కమిటీ పెట్టుకోవాలి.
వాటిని అరికట్టడానికి తీసుకోబోతున్న జాగ్రత్తల గురించి త్వరలో ఇండస్ట్రీ చెబుతుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. గురువారం అల్లు అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి పని చేయబోతోంది. 50 శాతం అవుట్‌సైడర్స్, 50 శాతంæఇండస్ట్రీవాళ్లతో కలిపి ఒక రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 క్రాఫ్ట్స్‌లో వారు ఏ విభాగానికి చెందితే అందులోంచి తొలగించాలని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో నేను కూడా ఉండబోతున్నా’’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి నేను సీనియర్ మెంబర్ని. నేను టార్గెట్ చేస్తున్నది రామ్‌గోపాల్ వర్మని. రామ్‌గోపాల్‌వర్మ అనే వ్యక్తి గొప్ప సినిమాలు తీసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆల్ ఇండియా డైరెక్టర్‌గా ముంబైలో ఉన్నాడు. ఆయన తెలుగు ఇండస్ట్రీని తల్లిలా భావించాలి. కానీ, అతను ఎంత ద్రోహం చేస్తున్నాడు? ఎంత నికృష్టుడో చెప్పడానికే మీ ముందుకు వచ్చా. ‘బాహుబలి’ తీసింది మేమురా? తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకుని గర్వపడే ఈ సమయంలో ఇలాంటివి ఏంటి? అని బాధపడుతున్న తరుణం.
బుధవారం రాత్రి ఓ వీడియో చూశాక రామ్‌గోపాల్ వర్మ‘గారు’ అనే గౌరవం పోయింది. ఒక ఛండాలపు మాటను పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డితో నేనే (వర్మ) అనిపించానని, ఇందుకు ఫ్యాన్స్‌కు క్షమాపణ అని రామ్‌గోపాల్ వర్మ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇంకో వీడియోలో రామ్‌గోపాల్‌వర్మ చెప్పడం వల్లే తాను ఇవన్నీ చేశానని శ్రీరెడ్డి వాయిస్ విన్నాను. ఈ వీడియో బయటకు వస్తుందని సేఫ్‌గా వర్మ ముందే తానే శ్రీరెడ్డితో అలా చెప్పించానని వీడియో రిలీజ్ చేసి, క్షమాపణ చెప్పాడు.
నువ్వు (వర్మని ఉద్దేశించి) సురేశ్‌బాబు (నిర్మాత) ఫ్యామిలీతో మాట్లాడి, శ్రీరెడ్డికి 5 కోట్లు ఇప్పించడానికి ట్రై చేశానని చెప్పావు. నేను సురేశ్ ఫ్యామిలీ మెంబÆŠ్సతో మాట్లాడాను. ‘‘లా ఆఫ్ ది ల్యాండ్‌కు మేము లొంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్. ఎంకరేజ్ చేయం’’ అని చెప్పారు. శ్రీరెడ్డికి నువ్వు ఇప్పిస్తానన్న 5 కోట్ల ఆఫర్ నీకు ఇచ్చింది ఎవరు? ఆ అమ్మాయితో ఓ బూతు మాట్లాడించి పవన్ సైజ్ (ఇమేజ్) తగ్గిండానికి నీకు ఫండ్ చేస్తున్నది ఎవరు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? వంటి సందేహాలతో నాకు నిద్ర పట్టలేదు.
ఇండస్ట్రీలోని ఒక ఫ్యామిలీపై నీకింత జాగ్రత్త ఉంటే.. మా కుటుంబం మీద లేదా? అంటే.. ఈ కుటుంబంలో చిరంజీవి, పవన్, రామ్‌చరణ్ ఉన్నారు. నీకీ కుటుంబం అంటే దుగ్ధ. సురేశ్ కుటుంబాన్ని కాపాడాలని అలా చేశానని అన్నావు. ఎంత నాటకం? నీ బతుక్కి అవసరమా? నువ్వు తెలివైనవాడివే. కానీ క్రూయల్ మైండ్. వర్మను ఏం చేస్తారనేది ఇండస్రీయే నిర్ణయిస్తుంది. వర్మకు సొసైటీ ఎటువంటి శిక్ష విధించాలి?’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment