
బంజారాహిల్స్: మండుటెండల్లో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల దాహార్తిని తీర్చేందుకు సినీ నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చారు. ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన మజ్జిగను తయారు చేయించి, ప్రతిరోజూ 300 బాటిళ్ల చల్లటి మజ్జిగను పోలీసులకు పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సైఫాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు బాటిళ్లను అందజేస్తున్నారు. ‘అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్’ పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు మజ్జిగ పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులకు మజ్జిగ బాటిళ్లు అందజేస్తున్న నిర్వాహకులు