Hyderabad Traffic Police Using Pushpa Poster Urge Wear Helmets: ప్రజల్లో 'పుష్ప'రాజ్ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్‌లు ప్రేక్షక జనాల్లో ఓ రేంజ్‌లో నాటుకుపోయాయి. డైలాగ్‌లు, పాటలను స్పూఫ్స్, కవర్ సాంగ్స్‌గా మలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమదైన శైలీలో పుష్పరాజ్ డైలాగ్‌లు కొట్టడం, అవి వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సినిమాలోని క్యారెక్టర్లను ఎవరికీ నచ్చినట్లు వారు వాడుకుంటున్నారు. ప్రముఖ వాణిజ్య సంస్థ 'అమూల్' తన వ్యాపారం కోసం 'పుష్పక్ ది స్లైస్.. అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్..' అనే కార్టూన్‌ను షేర్ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్‌గా మారింది.
తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పుష్పరాజ్‌ను వాడటం ఆసక్తికరంగా మారింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ఆ ఫొటోపై 'హెల్మెట్ తప్పని సరి.. తగ్గేదే లే..' అంటూ రాసి ఉంది. అలాగే 'హెల్మెట్ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.' అంటూ ట్వీట్ చేశారు పోలీసులు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకే ఈ సినిమాతో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది.
#HYDTPweBringAwareness
— Hyderabad Traffic Police (@HYDTP) January 14, 2022
Wear Helmet. It saves you #WearHelmet #Helmet #ThaggedheLe@jtcptrfhyd @dcptraffic1hyd. pic.twitter.com/VyGMUY43O8
ఇదీ చదవండి: పుష్పను వాడేసిన అమూల్, కామెంట్ చేసిన బన్నీ
Comments
Please login to add a commentAdd a comment