helmet wearing
-
అందుకే ‘హెల్మెట్’ పెట్టుకోమని చెప్పేది.. ఓసారి ఈ వీడియో చూడండి
బైక్‌పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాలు సైతం విధిస్తున్నారు. కానీ, చాలా మంది హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. అయితే, అలాంటి వారు ఈ వీడియోను చూస్తే వారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, హెల్మెట్ వల్ల ఏ మేర ప్రయోజనం ఉందో తెలుస్తుంది. ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి పడిపోయాడు. ఎదురుగా వస్తున్న బస్సు వెనకాల టైర్ల కిందకు దూసుకెళ్లాడు. హైల్మెట్ ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన గతంలో జరిగినా.. పాత వీడియోనే మరోమారు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను తాన్సుయోగెన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బస్సును ఢీకొట్టిన బైకర్.. వెనక టైర్ల కిందకు దూసుకెళ్లాడు. తల టైర్ కిందకు వెళ్లింది. దీంతో హెల్మెట్ పగిలింది. అయితే, బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తానే బస్ కింద నుంచి బయటకు రాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హెల్మెట్ ఉండటం వల్లే అతడి ప్రాణాలు నిలిచాయని కామెంట్ చేశారు. ‘అతడు పెట్టుకున్న హెల్మెట్ బ్రాండ్ నాకు చెప్పండి ప్లీజ్..’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు.. ఆ హెల్మెట్ తయారు చేసిన సంస్థనే ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుందని మరికొంత మంది పేర్కొన్నారు. My reactions in order: 1) OMG😱 2) I hope he has survived🙏 3) Yes he did👏 4) What is the brand of his helmet❓ pic.twitter.com/dnBugyycGe — Tansu YEĞEN (@TansuYegen) December 12, 2022 ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్!
లక్నో: సాధారణంగా బైక్‌పై వెళ్తే హెల్మెట్ ధరిస్తాం. కానీ, కారు, బస్సు, ట్రక్కుల్లో హెల్మెట్ ధరించటం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. లోని బస్ డిపోకు చెందిన ఆ బస్సు డ్రైవర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలు హెల్మెట్ ధరించిన కారణం తెలిస్తే మీరు షాకవుతారు. రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ వ్యక్తి వెంబడించి మరీ వీడియో తీశాడు. ఆ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. దీంతో గాయాలబారిన పడకుండా, వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ఇలా డ్రైవర్ హెల్మెట్ ధరించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం లోని బాగ్పత్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో బస్సును ఢీకొట్టటం వల్ల ముందు అద్దాలు పగిలిపోయాయని డ్రైవర్ చెప్పినట్లు వెల్లడించారు. Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 ఇదీ చూడండి: కదులుతున్న ట్రక్కుపై సూపర్ హీరోలా ఫీట్లు.. వీడియో వైరల్ -
ఇదెక్కడి మాస్ వాడకంరా మావ.. 'పుష్ప'ను వాడేసిన పోలీసులు
Hyderabad Traffic Police Using Pushpa Poster Urge Wear Helmets: ప్రజల్లో 'పుష్ప'రాజ్ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్‌లు ప్రేక్షక జనాల్లో ఓ రేంజ్లో నాటుకుపోయాయి. డైలాగ్‌లు, పాటలను స్పూఫ్స్, కవర్ సాంగ్స్‌గా మలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమదైన శైలీలో పుష్పరాజ్ డైలాగ్‌లు కొట్టడం, అవి వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సినిమాలోని క్యారెక్టర్లను ఎవరికీ నచ్చినట్లు వారు వాడుకుంటున్నారు. ప్రముఖ వాణిజ్య సంస్థ 'అమూల్' తన వ్యాపారం కోసం 'పుష్పక్ ది స్లైస్.. అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్..' అనే కార్టూన్‌ను షేర్ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్‌గా మారింది. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పుష్పరాజ్‌ను వాడటం ఆసక్తికరంగా మారింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ఆ ఫొటోపై 'హెల్మెట్ తప్పని సరి.. తగ్గేదే లే..' అంటూ రాసి ఉంది. అలాగే 'హెల్మెట్ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.' అంటూ ట్వీట్ చేశారు పోలీసులు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకే ఈ సినిమాతో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది. #HYDTPweBringAwareness Wear Helmet. It saves you #WearHelmet #Helmet #ThaggedheLe@jtcptrfhyd @dcptraffic1hyd. pic.twitter.com/VyGMUY43O8 — Hyderabad Traffic Police (@HYDTP) January 14, 2022 ఇదీ చదవండి: పుష్పను వాడేసిన అమూల్, కామెంట్ చేసిన బన్నీ -
జీవితం చిన్నది కాదు.. మీ కుటుంబం మీకోసం ఇంట్లో వేచి ఉంది..
సాక్షి, సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొంతమంది తమకేం కాదంటూ హెల్మెంట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ‘కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట’ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘దయచేసి హెల్మెట్ ధరించండి.. జీవితం చిన్నది కాదు, హెల్మెట్ ధరించి ఎక్కువ కాలం జీవించండి. మీ కుటుంబం మీ కోసం ఇంట్లో వేచి ఉంది’ అని కామెంట్ జతచేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. ఓ మహిళ బైక్ నడుపుతూ వెళుతోంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కారు యూటర్న్ చేద్దామని తిప్పడంతో ఆమె ఆ వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆమె హెల్మెట్ ధరించడంలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Please_Wear_Helmet Life will not be short, wear a helmet live longer.. your family is waiting for you at home. pic.twitter.com/lfXnxECo95 — Commissioner of Police, Siddipet (@siddipetcp) January 7, 2022 -
హెల్మెట్ల వాడకం ఇక తప్పనిసరి!!
ద్విచక్ర వాహనదారులంతా ఇక తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందే. లేకపోతే భారీ జరిమానాలు తప్పవు. ఈ నిబంధన దక్షిణ ఒడిషాలోని బెర్హంపూర్‌లో తాజాగా అమలులోకి వచ్చింది. కేవలం వాహనం నడిపేవాళ్లు మాత్రమే కాదు, వెనకాల కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని బెర్హంపూర్ ఎస్పీ ఏకే సింగ్ తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా, ఇప్పటివరకు దాని అమలు విషయాన్ని అంత గట్టిగా పట్టించుకోలేదు. కానీ, సురక్షిత డ్రైవింగ్‌లో భాగంగా ఎస్పీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీంతోపాటు డ్రంకెన్ డ్రైవింగ్ చేసేవారిని కూడా పట్టుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టాలని భావిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో 93 మంది మరణించగా 265 మంది గాయపడ్డారు. అదే 2012లో అయితే 117 మంది మరణించగా 106 మంది గాయపడ్డారు. అందుకే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.