హెల్మెట్ల వాడకం ఇక తప్పనిసరి!!
ద్విచక్ర వాహనదారులంతా ఇక తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందే. లేకపోతే భారీ జరిమానాలు తప్పవు. ఈ నిబంధన దక్షిణ ఒడిషాలోని బెర్హంపూర్లో తాజాగా అమలులోకి వచ్చింది. కేవలం వాహనం నడిపేవాళ్లు మాత్రమే కాదు, వెనకాల కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని బెర్హంపూర్ ఎస్పీ ఏకే సింగ్ తెలిపారు.
కొన్ని నెలల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా, ఇప్పటివరకు దాని అమలు విషయాన్ని అంత గట్టిగా పట్టించుకోలేదు. కానీ, సురక్షిత డ్రైవింగ్లో భాగంగా ఎస్పీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీంతోపాటు డ్రంకెన్ డ్రైవింగ్ చేసేవారిని కూడా పట్టుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టాలని భావిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో 93 మంది మరణించగా 265 మంది గాయపడ్డారు. అదే 2012లో అయితే 117 మంది మరణించగా 106 మంది గాయపడ్డారు. అందుకే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.