జీవితం చిన్నది కాదు.. మీ కుటుంబం మీకోసం ఇంట్లో వేచి ఉంది.. | Siddipet Commissioner Of Police Awareness To Wearing Helmet Over Accidents | Sakshi
Sakshi News home page

జీవితం చిన్నది కాదు.. మీ కుటుంబం మీకోసం ఇంట్లో వేచి ఉంది..

Published Sat, Jan 8 2022 1:34 PM | Last Updated on Tue, Jan 18 2022 4:53 PM

Siddipet Commissioner Of Police Awareness To Wearing Helmet Over Accidents - Sakshi

సాక్షి, సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని ట్రాఫిక్‌ పోలీసులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొంతమంది తమకేం కాదంటూ హెల్మెంట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ‘కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, సిద్దిపేట’ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు.

‘దయచేసి హెల్మెట్ ధరించండి.. జీవితం చిన్నది కాదు, హెల్మెట్ ధరించి ఎక్కువ కాలం జీవించండి. మీ కుటుంబం మీ కోసం ఇంట్లో వేచి ఉంది’ అని కామెంట్‌ జతచేశారు. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. ఓ మహిళ బైక్‌ నడుపుతూ వెళుతోంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కారు యూటర్న్‌ చేద్దామని తిప్పడంతో ఆమె ఆ వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆమె హెల్మెట్‌ ధరించడంలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement