
సిద్దిపేటజోన్: గతంలో సాగుచేసేందుకు రైతులు కిలోమీటర్ల దూరం నుంచి పైపుల ద్వారా నీటిని తరలించడానికి పైపులు వాడి నానాపాట్లు పడేవారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మించడం వల్ల చిన్నకోడూర్ ప్రాంత రైతులకు సుదూరం నుంచి సాగునీటిని తీసుకొచ్చే వ్యథ తప్పింది.
దీంతో నీటి తరలింపునకు వాడిన పైపులు చెట్టు పైన మూటకట్టిన దృశ్యాన్ని.. ముంగిట్లో గోదావరి జలాల స్థితిగతులు వివరిస్తోన్న ఓ ఫొటో ‘సాక్షి’ప్లస్‌లో మంగళవారం ప్రచురితమైంది. ‘సాక్షి’లో వచ్చిన ఫొటోపై మంత్రి హరీశ్‌రావు ‘తెలంగాణ జలదృశ్యం సాకారం’అని వ్యాఖ్యానిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి కొద్దినిమిషాల్లోనే వందల కొద్దీ లైకులు వచ్చాయి.
తెలంగాణ జలదృశ్యం
— Harish Rao Thanneeru (@trsharish) October 5, 2021
కలసాకారం..#Kaleshwaram pic.twitter.com/s3ET7TAVBR