ముంబై : 'యూ అండ్ ఐ.. ఇన్ దిస్ బ్యూటీఫుల్ వరల్డ్' అనే రింగ్ టోన్ మీకందరికే గుర్తుండే ఉండాలి. అదేనండి వొడాఫోన్ కంపెనీ తమ ప్రమోషన్‌లో భాగంగా ఒక పిల్లాడు నడుస్తుంటే నీ వెనుకే నేను అంటూ ఒక పగ్ (చిన్న కుక్క) వెంటపడేది. వాడు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేది. అప్పట్లో ఈ యాడ్ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లను కూడా బాగా అలరించింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం..
కరోనా నేపథ్యంలో ప్రజలు బయటికి రాకుండా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా కొంతమంది అనవసరంగా బయటికి వస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులకు తలనొప్పి వ్యవహారంలా మారింది. కానీ ముంబై పోలీసులు మాత్రం ఒక వినూత్న ప్రయోగానికి తెరతీశారు. వొడాఫోన్ రూపొందించిన యూ అండ్ ఐ.. ఇన్ దిస్‌బ్యూటీఫుల్ వరల్డ్ అనే రింగ్‌టోన్‌ను తీసుకొని దానికి కొన్ని మార్పులు చేశారు. 'మీరు మేము మళ్లీ కలుసుకుందాం... అప్పటివరకు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి.. మీరు బయటికి వచ్చారో నేను మీ వెంట పడతా' అంటూ ఒక జింగిల్‌ను క్రియేట్ చేశారు.
అయితే వీడియోలో ఒక కిటెన్ హౌస్‌లో పగ్‌ను పెట్టి దానిని కాపలాగా ఉంచినట్లు చూపించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ ముంబై పోలీసులు రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. మీ క్రియేటివిటీకి హాట్సాఫ్.. కరోనాపై అవగాహనకు మంచి ప్రయత్నం... పాత యాడ్‌ను మరోసారి గుర్తు చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(కలకలం: కరోనాతో ఏసీపీ మృతి)
Comments
Please login to add a commentAdd a comment