Allu Sirish Shocking Comments on AHA App - Sakshi
Sakshi News home page

Allu Shrish: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్‌ షాకింగ్‌ ట్వీట్‌

Published Mon, Jan 17 2022 12:35 PM | Last Updated on Tue, Jan 18 2022 7:40 AM

Allu Sirish Shocking Tweet About AHA App Goes Viral - Sakshi

Allu Sirish Shocking Tweet About AHA App Goes Viral: టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ స్థాపించిన తెలుగు ఏకైక ఓటీటీ యాప్‌ ఆహా. లెటెస్ట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు సరికొత్త రియాలిటీ షోతో ఆహా డిజిటల్‌ రంగంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆహా స్థాపించిన కొద్ది కాలంలోనే అగ్ర ఓటీటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఆహా సబ్‌స్రైబర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆహాతో తనకు సంబంధం లేదంటూ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు అల్లు వారి వారసుడు, హీరో అల్లు శిరీష్‌. 

చదవండి: ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్‌

దీంతో అతడి ట్వీట్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌ మారింది. కాగా ఆహా సబ్‌స్రైబర్లు యాప్‌లో ఏమైన సమస్యలు ఎదురైతే ట్వీటర్‌ వేదిక తమ సమస్యలను లెవనెత్తుతున్నారు. యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను చెబుతూ దీనిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్‌ టీంతో పాటు అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఆహాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సోషల్ మీడియాలో వీరిని ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు.

అతడు ఈ ట్వీట్‌ని షేర్ చేసి.. ‘ఆహాని ట్యాగ్ చేస్తూ చాలామంది నేను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్‌ని చూడండి’ అంటూ పోస్ట్ చేశాడు. శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘ఏంటి శిరీష్‌కు ఆహాకి సంబంధం లేదా’ ప్రశ్నిస్తున్నారు. అంతేగా ఆహా అల్లు ఫ్యామిలీదే కదా, ఆహాతో తనకు సంబంధం లేకపోవడం ఏంటని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘శిరీష్‌ ఇంకా ఆహా బాధ్యతలను స్వీకరించలేదేమో అందుకే ఇలా స్పందించాడు’ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: నా బెస్ట్‌ ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌ సమంతనే: నాగ చైతన్య

అయితే ఆహాలో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది ఇందులో పార్ట్‌నర్లుగా ఉన్నారు. ఐకాన్‌ స్టార్‌, అల్లు అరవింద్‌ రెండో కుమారుడు అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆహాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆహా చేసే ప్రతి ఈవెంట్‌లోనూ అల్లు అర్జున్ భాగమవుతున్నాడు. అలాగే అల్లు అరవింద్‌ పెద్ద కుమారుడు బాబీ కూడా ఆహాకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్నాడు. ఇలా అల్లు వారి వారసులు ఆహాలో ఏదోకవిధంగా భాగమవుతున్నారు. అయితే ఇంతవరకు అల్లు శిరీష్‌ మాత్రం ఆహాలోని ఏ ఈవెంట్‌లో కనిపించకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement