ఘనంగా ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం కొత్త చిత్రం, టైటిల్‌ ఇదే.. | Kiran Abbavaram New Movie Starts In Hyderabad In Geetha Arts 2 Banner | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: ఘనంగా ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం కొత్త చిత్రం, టైటిల్‌ ఇదే..

Jan 7 2022 1:56 PM | Updated on Jan 7 2022 1:56 PM

Kiran Abbavaram New Movie Starts In Hyderabad In Geetha Arts 2 Banner - Sakshi

‘రాజావారు రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు టాలెంటెడ్‌ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ముఖ్య అతిధిగా హాజ‌రై చిత్ర ప్రారంభ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు. ఇక అల్లు అన్విత హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, హీరోయిన్ క‌శ్మీరా ప‌ర్ధేశీలపై క్లాప్‌తో చిత్రాన్ని ప్రారంభించారు.

నిర్మాత బ‌న్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. ఈ మూవీతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కాబోతుండగా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం,‌ భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా,చావు క‌బురు చ‌ల్ల‌గా,  ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఓ వినూత్న‌మైన క‌థ‌తో ఈ నూత‌న చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా నిర్మాత బ‌న్నీవాసు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement