
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోతాయి. కొత్త నటినటులు ఉన్నప్పటికి ఈ బ్యానర్‌లో వచ్చే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే ఏ నిర్మాణ సంస్థకు అయిన వారివారి కూతుళ్ల పేర్లులేదా భార్య పేరు, ఇంటి పేరు ఉంటుంది. కానీ, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్’లో గీత అనేది ఎవరు పేరు అనేది ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే ఈ పేరుతో అల్లు కుటుంబంలో ఎవరు లేకపోవడమే!
చదవండి: బిగ్‌బాస్ 6: గీతూ రాయల్ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
తాజాగా గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో రివీల్ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్‌లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు‘’ అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్‌కు గీత ఆర్ట్స్ పెట్టడం వెనక అసలు కారణమేంటో ఆయన వివరించారు.
చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్
‘‘నిజానికి ‘గీత ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్‌ను పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య). భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో ‘గీత ఆర్ట్స్’ అని పెడదామని నాన్నగారు అనడం.. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్ అని మార్చొచ్చు కదా అని హోస్ట్ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకే మార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్.
Comments
Please login to add a commentAdd a comment