ఒక అమ్మ ప్రయాణం | Itlu Amma Movie TiTle Logo Launch | Sakshi
Sakshi News home page

ఒక అమ్మ ప్రయాణం

Published Tue, Feb 11 2020 4:04 AM | Last Updated on Tue, Feb 11 2020 5:02 AM

Itlu Amma Movie TiTle Logo Launch - Sakshi

బొమ్మక్‌ మురళి, అల్లు అరవింద్, ఉమా మహేశ్వర రావు, రేవతి

రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు అమ్మ’. ‘మదర్స్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ యునైట్‌’ అనేది ఉపశీర్షిక. ‘అంకురం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన సి. ఉమామహేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. బొమ్మక్‌ క్రియేష¯Œ ్స పతాకంపై బొమ్మక్‌ మురళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోని విడుదల చేసిన అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘అంకురం’ సినిమా చూసి ఆ దర్శకుడు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను. నేను అలా అనుకున్న మరో దర్శకుడు బాలచందర్‌. ‘అంకురం’ సినిమా నాకిప్పటికీ గుర్తుంది.

కొంతమంది మాత్రమే ఉమా మహేశ్వరరావుగారిలా సమాజం కోసం కథలు రాసి సినిమాలు రూపొందిస్తుంటారు’’ అన్నారు. ‘‘చెడు మార్గంలో పయనిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని మా చిత్రం ఇస్తుంది’’ అన్నారు ఉమామహేశ్వరరావు. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది’’ అన్నారు బొమ్మక్‌ మురళి. ‘‘ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా. జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు’’ అన్నారు రేవతి. సినిమాటోగ్రాఫర్‌ మధు అంబట్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నాగులపల్లి కనకదుర్గ, దేవి, విమల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎంఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement