
చిరంజీవి
150వ చిత్రం (ఖైదీ నంబర్ 150) తర్వాత ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘సైరా’లో నటిస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సోషల్ డ్రామా సబ్జెక్ట్ చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్‌గా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ నిర్మిస్తారట.
‘శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుంది’ అని ఇప్పటికే పలు సందర్భాల్లో చిరంజీవి పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్‌తో కూడిన సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలను ఎక్కువగా రూపొందిస్తారు శంకర్. మరి చిరంజీవి, శంకర్ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా ఎలాంటి జానర్‌లో ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమాపై దృష్టి పెడతారట శంకర్. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment