అల్లు అరవింద్, వెంకటేశ్, వరుణ్‌తేజ్, మెహరీన్
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో సందడి సందడిగా స్టార్ట్ అయింది. వైవిధ్యమైన చిత్రాలతో జోరు మీదున్న వెంకటేశ్, ఫిదా, తొలి ప్రేమ సినిమాల విజయాలతో మంచి ఊపు మీదున్న వరుణ్ తేజ్ ఈ ఎఫ్ అండ్ ఎఫ్‌కి హీరోలు. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది చిత్రానికి ఉపశీర్షిక. హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగింది.
తొలి సన్నివేశంలో పాల్గొన్న ఇద్దరు హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లపై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. అనంతరం అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, శిరీష్, వెంకటేశ్, వరుణ్ తేజ్ అందరూ కలిసి సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడికి అందించారు. జూలై 5న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తారు. సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవంలో శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment