Producer Suresh Babu unveils 'Annapurna Photo Studio' first look - Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఏం జరిగింది?

Published Thu, Mar 16 2023 10:46 AM | Last Updated on Thu, Mar 16 2023 11:38 AM

Annapurna Photo Studio Movie First Look Released By Suresh Babu - Sakshi

చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును’ అనేది ఉపశీర్షిక. బిగ్‌బెన్‌ సినిమాస్‌పై యశ్‌ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేసి, సినిమా హిట్‌ సాధించాలని ఆకాంక్షించారు.  చైతన్యరావు మాట్లాడుతూ –‘‘ఇప్పుడున్న ఫాస్ట్‌లైఫ్‌ నుంచి దూరంగా ప్రేక్షకులను 1980 నేపథ్యంలోకి తీసుకువెళ్లే సినిమా ఇది’’ అన్నారు.

‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. కథలో ఉన్న ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు చందు. ‘‘ఫన్, థ్రిల్లింగ్, క్రైమ్‌ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత యశ్‌ రంగినేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement