
‘‘మన్యంరాజు’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. సినిమా చూడాలనే కుతూహలాన్ని రేపుతోంది. ఈ చిత్రం హిట్ అయి, యూనిట్‌కి మరిన్ని అవకాశాలు తీసుకురావాలి’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు అన్నారు. జీవన్, బేబీ పరిణిక జంటగా బీయమ్ సోముసుందరం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యంరాజు’. వాయుపుత్ర ఆర్ట్స్‌పై విజయ్ బాబు, వై.ప్రవీణ్, పుష్పలత.బి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని సురేశ్ బాబు రిలీజ్ చేశారు.
బీయమ్ సోము సుందరం మాట్లాడుతూ–‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జీవన్. ‘‘మే లో సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment