
Suresh Babu About Rajinikanths Peddanna Movie: ‘‘పెద్దన్న’ సినిమాని మేము ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందనే నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్ బాబు అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. చదవండి: పెళ్లి చేసుకోవాలనుంది..అబ్బాయి దొరకడం లేదు: హీరోయిన్
ఈ సినిమాని ఏషియన్ ఇన్‌ఫ్రా ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పి, సురేశ్ బాబు, ‘దిల్’ రాజు కలిసి ‘పెద్దన్న’ పేరుతో తెలుగులో ఈ నెల 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు విలేకరులతో మాట్లాడుతూ–‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘మాపై నమ్మకంతో ‘పెద్దన్న’ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఇచ్చిన సన్‌టీవీ వారికి, రజనీకాంత్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు.
చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్
పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్