
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.
వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment