చూసీ చూడంగానే నచ్చుతుంది | Producer Raj Kandukuri Son New Movie Choosi Choodangaane | Sakshi
Sakshi News home page

చూసీ చూడంగానే నచ్చుతుంది

Published Wed, Dec 4 2019 3:02 AM | Last Updated on Wed, Dec 4 2019 3:02 AM

Producer Raj Kandukuri Son New Movie Choosi Choodangaane - Sakshi

నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించారు. ‘పెళ్ళి చూపులు, మెంటల్‌ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన రాజ్‌ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత డి. సురేష్‌బాబు, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ విడుదల చేశారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మా గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై విడుదల కానుంది. గోపీసుందర్‌ మంచి సంగీతం అందించారు. ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వేద రామన్‌ చక్కని విజువల్స్‌ అందించారు. ఈ నెల చివరి వారంలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement