బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు.
అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment