స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ ఖండించాలంటూ టాలీవుడ్ ప్రముఖులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ వారి నుంచి పెద్ద రెస్పాన్స్ రావట్లేదు. ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌తో పాటు నట్టి కుమార్ మాత్రమే చంద్రబాబు అరెస్ట్‌ని ఖండించారు. బడా నిర్మాతలు, హీరోలు ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నాయకులు వారికి ఫోన్లు చేసి మరీ బ్రతిమిలాడుతున్నారట.
(చదవండి: ఎన్టీఆర్‌పై చెప్పులు విసరడం నా కళ్లారా చూశా: మోహన్ బాబు)
ఇదిలా ఉంటే..తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై స్పందించాడు. సినిమా వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా సినిమా వ్యాపారం చేసుకోవడం మంచిదని హితవుపలికారు. తాజాగా ఆయన సప్త సాగరాలు అనే సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌పై మీ స్పందన ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా ..సినిమా రంగం రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు.
‘ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలా మంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. చంద్రబాబు అరెస్ట్ అనేది సున్నితమైన అంశం. దీనిపై ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా కాదు.. మేం మూవీ మేకర్స్. సినిమాలు మాత్రమే తీస్తాం.
చాలా మంది స్టేట్‌మెంట్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం? రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశంపై స్టేట్‌మెంట్ ఇవ్వలేం కదా? తెలుగు దేశం పార్టీకీ సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సినిమా వాళ్లు స్పందించడం సరికాదు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదని నా అభిప్రాయం’అని సురేశ్ బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment