వెరైటీ టైటిల్‌.. కొత్త గెటప్‌తో వెంకీ | Venkatesh Asuran Remake Title Is Narappa | Sakshi
Sakshi News home page

వెరైటీ టైటిల్‌.. కొత్త గెటప్‌తో వెంకీ

Jan 21 2020 10:06 PM | Updated on Jan 21 2020 10:13 PM

Venkatesh Asuran Remake Title Is Narappa - Sakshi

ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే హీరో విక్టరీ వెంకటేష్‌. వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆయన తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు నిర్మిస్తున్నాడు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లో.. మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ఈ చిత్రం  టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్‌ సినిమా టైటిల్‌ ఇదే అంటూ గుబురు గడ్డంతో ఉన్న వెంకటేష్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వెంకటేష్‌ కొత్త సినిమా టైటిల్‌ ‘ నారప్ప’  అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, సినిమా టైటిల్‌పై చిత్ర బృదం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.  వెంకటేశ్‌ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్‌ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement