
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటిస్తారని తెలిసింది. డి.సురేష్ బాబు, కలైపులి యస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. తొలి షెడ్యూల్ అనంతపురంలో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో తన క్యారెక్టర్ లుక్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై దృష్టి పెట్టారు వెంకీ.