నిర్మాత సురేష్‌ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు | Covid Vaccine Fraud: Producer Suresh Babu Filed Complaint Against Him | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత దగ్గర డబ్బులు గుంజిన కేటుగాడు

Published Tue, Jun 22 2021 9:23 AM | Last Updated on Tue, Jun 22 2021 12:43 PM

Covid Vaccine Fraud: Producer Suresh Babu Filed Complaint Against Him - Sakshi

నిర్మాత సురేష్‌ బాబు ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ బడా నిర్మాత సురేష్‌ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయంటూ లక్ష రూపాయలు దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు.

దీంతో అది నిజమని నమ్మిన మేనేజర్‌ అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్‌ చేసినా అతడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇదంతా పెద్ద మోసం అని గ్రహించిన మేనేజర్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

చదవండి: హీరోగా రానా త‌మ్ముడు.. ఆ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement