ఎమ్మెల్యే రాచమల్లు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నవెఎస్సార్‌సీపీ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడుసురేష్‌బాబు, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ప్రొద్దుటూరు టౌన్ : చంద్రబాబు నియంత పాలనను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తలపిస్తున్నాడని మేయర్ సురేష్‌బాబు అన్నారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌లో ఆవరణలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా శనివారం మేయర్ సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దీక్షాశిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఐదేళ్ల కిందట ప్రొద్దుటూరులోని శివాలయాన్ని ఐదు నెలలు మూయించి దేవునికి పూజలు లేకుండా చేసిన ఘనత వరదరాజులరెడ్డిదేనన్నారు. కూరగాయలమార్కెట్‌ను తొలగించాలని ప్రయత్నించాడన్నారు. వైస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుందూ–పెన్నా కాలువకు నిధులు ఇచ్చారన్నారు.
అయితే అలైన్‌మెంట్ మార్చడంతో రైతులు కోర్టును ఆశ్రయించారన్నారు. నీరు రాకుండా చేసింది కూడా వరదరాజులరెడ్డిని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పార్కును ఆడుకోవడానికి లేకుండా ట్యాంక్ నిర్మాణం చేయాలని చూడటం చట్టవిరుద్దమని, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కడప నగరంలో 12 ట్యాంకులు కడుతున్నామని, ఎక్కడా అభ్యంతరం లేదన్నారు. పాత మార్కెట్‌ను ఆదుణీకరించేందుకు రూ.12 కోట్లు మంజూరు చేశారన్నారు. అయితే ప్రజలు అలాగే ఉంచాలని కోరితే ముఖ్యమంత్రి వైఎస్ దాన్ని చెక్కుచెదరనివ్వలేదన్నారు. ప్రజల మనోభాలవను పరిగణలోకి తీసుకున్న నాయకుడన్నారు.
స్వార్థరాజకీయాల కోసం...
స్వార్థ రాజకీయాల కోసం వరద ఎవ్వరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరన్నారు. తాను చెప్పిందే జరగాలన్న వ్యక్తి అన్నారు. అన్నా క్యాంటిన్ కూడా అతని అనునాయకులకు ఇచ్చి నడిపించే వ్యక్తి వరద అన్నారు. రూ.2 కే 20 లీటర్ల నీళ్లు ఇస్తామని చెప్పి ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. అన్నా క్యాంటిన్ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 2800 పోస్టులు రూ.200 కోట్లకు అమ్ముకున్న లోకేష్ సర్వశిక్షా అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లోని స్కూళ్లకు కేంద్రం రూ.వేల కోట్ల నిధులు ఇస్తోందన్నారు. దీన్ని అడ్డుగా పెట్టుకొని జిల్లాకు 150 పోస్టులని సృష్టించి 2800 ఔట్ సోర్సింగ్ పోస్టులను రూ.200 కోట్లకు లోకేష్‌బాబు అమ్ముకున్నారన్నారు.
నాలుగేళ్ల తరువాత అన్నా క్యాంటిన్ గుర్తుకు వచ్చిందా: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నాలుగేళ్లు అయిందని, ఇప్పుడు అన్నా క్యాంటిన్ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ఈ క్యాంటిన్ మరో రెండు, మూడు నెలలు గడుస్తుందన్నారు. దీని కోసం పాత బస్టాండ్‌లో 50 ఏళ్లుగా దుకాణాలు పెట్టుకొని జీవిస్తున్న వారిని రోడ్డున పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ప్రక్కన స్థలం ఉందని అక్కడ కడితే ఏ సమస్య లేదని పేర్కొన్నారు. పన్నులు కట్టించుకుంటున్న అధికారులు ప్రజలకు సౌకర్యాలు కల్పించక పోతే చొక్కా పట్టుకొని ఎందుకు నిలదీయకూడదని అన్నారు. ప్రజలకు ఏదో ఒక అసౌకర్యం కల్పించాలనేది వరద తత్వమని తెలిపారు.
నేల మాలి లోని గుప్త నిధులు ఏమయ్యాయి...
నేలమాలిలోని గుప్త నిధులు ఏమయ్యాయని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. వజ్రాలు, అన్నీ విదేశాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్నారు. ఏమయ్యాయని ప్రశ్నిస్తే జవాబు లేదన్నారు. నిన్నకాక మొన్న చార్జి తీసుకున్న పాపాల భైరవుడు మా సుధాకర్ యాదవ్‌పై పడుతున్నాయని అన్నారు. ఆయన ఏం సమాధానం చెబుతారన్నారు. ఇదీ చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పారు.
వివాద సామ్రాట్ వరద : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వరద కాలువను, హౌసింగ్ పథకాన్ని , అనిబిసెంట్ హైస్కూల్‌లో అభివృద్ధి పనులను, చేనేత పింఛన్లు ఇప్పించడంలో వివాదాలు తెస్తున్న వరదరాజులరెడ్డి ఇప్పటికైనా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో కార్మికుడు చనిపోతే అతని భార్య మేరీకి ఇవ్వాల్సిన ఉద్యోగాన్ని ఎక్స్ కౌన్సిలర్ మేరువ వరదరాజులు కుమారుడికి ఇచ్చి వరద వివాదం చేశారన్నారు.పాత బస్టాండ్‌లో బస్‌షెల్టర్ కూల్చకూడదు, కానీ కూలుస్తానంటూ వివాదం చేస్తున్నారని తెలిపారు. తాను తన గురువు విషయంలో బాధపడుతున్నానన్నారు. 16 మంది టీడీపీ కౌన్సిలర్లు పార్కులో ట్యాంక్ నిర్మాణం, పాత బస్టాండ్‌లో ఉండే షెల్టర్ కూల్చి వేయడం తప్పని చెబుతున్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, వారి కౌన్సిలర్లను స్వాగతిస్తున్నానన్నారు. అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఏ పేదలు అయితే ఓట్లు వేసి అధికారం ఇచ్చారో వారిని నిరాశ్రయులను చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. పోలీసుల బూటు కాలి దెబ్బ మొదట తన ఎదపై పడాలన్నారు. తరువాత వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లపై పడాలన్నారు. ఈ విషయంలో కలుగ చేసుకోవాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.లా అండ్ ఆర్డర్ లేకుండా చేసేందుకు వరదరాజులరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు, కలెక్టర్ చొరవ తీసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment