సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా 5 రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లను బంద్ చేస్తున్నట్టు దక్షిణాది సినీ నిర్మాతల మండలి ప్రకటించింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్‌వో సంస్థలు) వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్)ను తగ్గించాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జేఏసీ చైర్మన్ డి.సురేశ్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
థియేటర్లు బంద్
Mar 2 2018 10:49 AM | Updated on Mar 21 2024 5:24 PM
Advertisement