ఎర్రగుంట్ల: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముందుగా కాంట్రాక్టు కార్మికులందరిని పర్మినెంట్ చేసి, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్ సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు– 2018ను ఉపసంహరించాలంటూ 1104 యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అ«ధ్యక్షడు జగదీశ్వర్ చేస్తున్న నిరాహార దీక్షను సందర్శించి జగదీశ్వర్‌కు నిమ్మరసం ఇచ్చి సురేష్‌బాబు, సుధీర్‌రెడ్డిలు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ బుధవారం సాయంత్రం దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ కార్మిక సోదరులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చూస్తే చాలా బాధాకరమన్నారు. నాలుగేళ్లుగా జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో ఔట్ సోర్సింగ్ బాధితులు చాలా ఎక్కువగా కన్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సీఎం రమేష్ నియంతగా వ్యవహరిస్తున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే 600 మెగావాట్ల యూనిట్‌ను పెంచిన వ్యక్తి వైఎస్సారే అని యువతకు ఉపాధి కల్పించారన్నారు. ఈ రోజు ఆ యూనిట్లను రన్ కాకుండా నిలుపుదల చేసే పరిస్థితి ఉందన్నారు. 600 మెగావాట్లను రన్ కాకుండా చేస్తున్నారని చెప్పారు. జిల్లా వాసి అయిన సీఎండీ ఈ ప్రాంత వాసులను అన్యాయం చేస్తున్నారని చెప్పారు. బినామీగా సీఎం రమేష్, నారా లోకేష్ ద్వారా బొగ్గులో కుంభకోణం జరిగిందన్నారు. ఉక్కు పరిశ్రమ వస్తే చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.
టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం
టీడీపీ ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్‌మెంట్ అవినీతిమయం అయిందని తెలిపారు. మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాగానే ఆర్టీపీపీలో అన్ని యూనిట్లు పనిచేసేలా బాధ్యత తీసుకుంటామన్నారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఉచిత హామీలను ఇచ్చి మోసం చేశారన్నారు.
కార్మికులకు సంపూర్ణ మద్దతు
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రవేటీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను మూయించే ఆలోచనలో ఉందన్నారు. అందులో భాగంగానే గతంలో సీసీఐను ప్రవేటీకరణ చేసి ఎందరో ఉద్యోగులను, కార్మికులను రోడ్డున వేశారన్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలను కూడా ప్రవేటీకరణ చేసి పెద్ద కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలో ఉన్నాయని, అందుకే బిల్లు ఆమోదం పొందకుండా ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీపీపీని స్థానిక అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని చెప్పారు. బ్యాక్‌డౌన్ పేరుతో ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి నీటిని సరఫరా చేసి దానిని మనుగడను కాపాడిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు. అందుకే వైఎస్ జగనన్న సీఎం అయితే మన ప్రాంతంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర అ««ధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌లు ప్రసంగించారు.
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తాం
Published Thu, Jan 10 2019 4:11 AM | Last Updated on Thu, Jan 10 2019 4:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment