
సాక్షి, అమరావతి : ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు ఏకగ్రీవం అయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. (విధేయతకు పట్టం)
సురేష్‌బాబు గురించి సంక్షిప్తంగా
పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు)
విద్యార్హత: బీడీఎస్(డెంటల్)
వృత్తి: డెంటిస్ట్
పుట్టిన తేది: 6.7.1966
చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం)
♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం)
♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్
♦ వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త
♦ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment