Penumatsa Sambasiva Raju
-
ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు ఏకగ్రీవం అయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. (విధేయతకు పట్టం) సురేష్‌బాబు గురించి సంక్షిప్తంగా పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) విద్యార్హత: బీడీఎస్(డెంటల్) వృత్తి: డెంటిస్ట్ పుట్టిన తేది: 6.7.1966 చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం) ♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ♦ వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ♦ ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
నామినేషన్ వేసిన పెన్మత్స సురేష్ బాబు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (విధేయతకు పట్టం) ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని, చెడ్డపేరు తీసుకురానని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పెన్మత్స సాంబశివరావు వారసుడుగా సురేష్ బాబు పార్టీకి విధేయుడుగా ఉన్నారన్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. -
విధేయతకు పట్టం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విధేయతకు సరైన గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు)ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును మంగళవారం ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ పురోభివృద్ధికిసాంబశివరాజు అహర్నిశలూ కృషి చేశారు. వయోభారంతో కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. అనారోగ్యంతో సోమవారం ఆయన కన్నుమూశారు. పెద్దాయన మరణంతో ఆయన కుటుంబసభ్యులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి, డాక్టర్ సురేష్ బాబు ను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మంగళవారం ఆయన పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేశారు. 13న నామినేషన్ దాఖలు ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సురేష్ బాబు, 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓటమిచెందారు. అయినప్పటికీ నిత్యం పార్టీ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి బరిలోకి దింపాలని సాంబశివరాజు యత్నించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలోనే ఆ కుటుంబా నికి తగిన గుర్తింపునిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నారు. కాగా గురువా రం ఉదయం నామినేషన్ దాఖలుచేయనున్నట్లు సురేష్ బాబు ’సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. సురేష్‌బాబు గురించి సంక్షిప్తంగా పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) విద్యార్హత: బీడీఎస్(డెంటల్) వృత్తి: డెంటిస్ట్ పుట్టిన తేది: 6.7.1966 చేపట్టిన పదవులు: ఎంపీటీసీ(మొయిద గ్రామం) ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్(డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వం) ♦ ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ♦ వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ♦ ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు పూర్తి
సాక్షి, విజయనగరం: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయన స్వస్థలమైన మెయిదలో అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పలువురు అధికారులు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. (పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత) -
'బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం'
పూసపాటిరేగ (విజయనగరం) : తుపాను బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. సోమవారం మండలంలోని తిప్పలవలస గ్రామంలో 600 మంది తుపాను బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సహకారంతో ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, చీర, జాకెట్లను పంపిణీ చేశారు. బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు తరఫున సహకారం అందిస్తున్న వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్‌బాబు, చిత్రంలో ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిప్పలవలసలో పర్యటించి తుపాను బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు సహాయం అందించామన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాఫెడ్ డెరైక్టర్ కేవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ నష్టపోయిన బాధితులందరిని ఆదుకుని వారు స్థిమితపడే వరకూ అండగా నిలవాన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి పి. సురేష్‌బాబు, పార్టీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, డీసీసీబీ డెరైక్టరు బర్రి చిన అప్పన్న, మహంతి లక్ష్మణరావు, మలుకుర్తి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పెనుమత్సకే పగ్గాలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు నియమితులయ్యా రు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరాజుపై అధిష్టానం నమ్మకం ఉంచింది. దీంతో ఆయనకు రెండోసారి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం జరిగిన ప్రజాప్రస్థానం ప్లీనరీలో సాంబశివరాజు నియామకాన్ని ప్రకటించారు. ఆయన నియామకంపై పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.