
సాక్షి, విజయనగరం: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయన స్వస్థలమైన మెయిదలో అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పలువురు అధికారులు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. (పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment