Samba Siva Raju
-
సీనియర్ నేత పెనుమత్స కన్నుమూత
సాక్షి ప్రతినిధి, విజయనగరం/నెల్లిమర్ల రూరల్/సాక్షి, అమరావతి: రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (88) సోమవారం తుది శ్వాస విడిచారు. ఐదు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిగా పెనుమత్స గుర్తింపు పొందారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకూ.. ► విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిదలో సాంబశివరాజు జన్మించారు. ► 1957లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మొయిద సర్పంచ్‌గా, రెండు సార్లు నెల్లిమర్ల బ్లాక్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ► 1967, 1972లో గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత సతివాడ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి అప్పటి నుంచి ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడిగా కొనసాగారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో సాంబశివరాజు స్వగ్రామంలో అంత్యక్రియలను అధికారులు పూర్తిచేశారు. అంత్యక్రియల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. సాంబశివరాజు కుమారుడు డాక్టర్ సురేష్‌బాబును ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫోన్లో పరామర్శించారు. ముఖ్యమంత్రి జగన్ సంతాపం సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో మచ్చలేకుండా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నేత సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటన్నారు. సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎందరికో ఆదర్శప్రాయుడు: మంత్రి బొత్స రాజకీయాల్లో తనదైన ముద్రవేసి ఎందరికో ఆదర్శప్రాయుడైన సాంబశివరాజు మృతి తీరనిలోటని ఓ ప్రకటనలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. సాంబశివరాజు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు పూర్తి
సాక్షి, విజయనగరం: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయన స్వస్థలమైన మెయిదలో అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పలువురు అధికారులు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. (పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత) -
పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత
-
సాంబశివరాజు మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: రాజకీయ కురువృద్ధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత) తెలుగు ప్రజలకు తీరని లోటు: ధర్మాన మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశారని, విలువలతో నిజాయితీ గా రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబశివరాజు కృషి మరువలేనిది: ఆళ్ల నాని విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించిన సాంబశివరాజు మరణం ఉత్తరాంధ్ర కే కాకుండా వైస్సార్సీపీ తీరని లోటని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైఎస్సార్సీపీలో క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు ఎంతో చిత్త శుద్ధితో నిర్వహించి.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంలో సాంబశివరాజు చేసిన కృషి మరువలేనిదని, ఈ ఆపత్కాలంలో వారి కుటుంబానికి భగవంతుడు మనో దైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నట్టు ఆళ్ల నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు.. పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. సాంబశివరాజు మరణం తనను వ్యక్తిగతంగా తీవ్రంగా బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబశివరాజు నీతి నిజాయితీ కలిగి విలువలతో రాజకీయాలు నెరపిన మచ్చలేని తొలితరం రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. ఏనాడు పదవుల కోసం, అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని, దాన ధర్మాలతో ఉన్న ఆస్తులు కరిగించుకున్న ధర్మాత్ముడని శ్రీరంగనాథ రాజు అన్నారు. గురుతుల్యులను కోల్పోయా... పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, ఎందరికో ఆదర్శప్రాయులైన సాంబశివరాజు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో పని చేసి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. అభివృద్ధిలో చెరగని ముద్ర.. మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా సాంబశివరాజు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటి నిలిచి వారి ఆశయ సాధన కోసం చివరి వరకు పనిచేసిన సాంబశివరాజు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు. -
పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత
సాక్షి, విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం జగన్ ఆదేశం వైఎస్సార్సీపీ సీనియర్ నేత దివంగత పెనుమత్స సాంబశివరాజు పార్ధివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి సంతాపం మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సంతాపం తెలిపారు. విజయనగరం రాజకీయాల్లో ఆయన అరుదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్, జిల్లాకి ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పుష్ప శ్రీవాణి తెలిపారు. -
హుద్‌హుద్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
నెల్లిమర్ల: ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులను వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా అన్నివిధాలా ఆదుకున్నామని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. తుఫాన్‌వల్ల చనిపోయిన 14మంది కుటుంబాలకు రూ.50వేలు చొప్పున వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. మండలంలోని దన్నానపేట గ్రామానికి చెందిన పంతగడ ప్రతాప్ అనేవ్యక్తి హుద్‌హుద్ తుఫాన్ సమయంలో స్థానిక చెరువు దాటుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతాప్ భార్య వెంకటదుర్గకు వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున పెనుమత్స సాబంశివ రాజు శుక్రవారం రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాలకు చెందిన కుటుంబాలకు వైఎస్సార్ ఫౌండేషన్‌ద్వారా బియ్యం, వస్త్రాలు అందజేశామని చెప్పారు. అయితే ప్రభుత్వం తరఫున బాధితులకు అందాల్సిన సాయం ఇప్పటిదాకా పూరిస్థాయిలో అందలేదని ఆరోపించారు. జిల్లాలో లక్షలాదిమంది రైతులు పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే ఇప్పటిదాకా రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. రైతుసాధికార సదస్సుల ద్వారా కేవలం ఒక్కోగ్రామానికి ఒకరిద్దరే రైతులను మాత్రమే ఎంపికచేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. టేకు, మామిడి, కూరగాయలు తదితర పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిం చారు. నష్టపరిహారం అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుద్‌హుద్‌వల్ల నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యు డు గదల సన్యాసినాయుడు, రైతువిభాగం కన్వీనర్ సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంటకరమణ, మాజీ ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, పార్టీనేతలు జానా ప్రసా ద్, రేగాన శ్రీనివాసరావు, తర్లాడ దుర్గారావు, మహంతి రామారావు, మీసాల నారాయణరావు, తులసి పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
పూసపాటిరేగ : తుపాను బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని తిప్పలవలస, చింతపల్లి గ్రామాల్లో పర్యటించారు. తిప్పలవలసలో కోట్లాది రూపాయల విలువైన బోట్లు, వలలు గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బాధితులకు ప్రభుత్వపరంగా సహకారం అందేలా చూస్తామన్నారు. సముద్రానికి దూరంలో ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మత్స్యకార నాయకుడు వాసుపల్లి కన్నయ్య తాత విన్నవించారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి తీవ్ర నష్టాన్ని చూశామని పలువురు ఆయన వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేవీ సూర్యనారాయణ రాజు, విజయనగరం ఏఎంసీ చైర్మన్ అంబల్ల శ్రీరాములనాయుడు, మండల నాయకులు పతివాడ అప్పలనాయుడు, డీసీసీబీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న, మహంతి లక్ష్మణరావు, మలుకుర్తి శ్రీనివాసరావు, సీహెచ్ సత్యనారాయణరాజు, అప్పడు దొర, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి చీపురుపల్లి : హుదూద్ తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోయూరని, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగ ళవారం ఆయన మండలంలోని పేరిపి, ఇటకర్లపల్లి గ్రామాల్లో తుపానుకు పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో ఎన్నడూ ఇంతటి విపత్తు జరగలేదన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ముఖ్యం గా చీపురుపల్లి మండలంలో వేలాది ఎకరాల్లో అరటి, చెరుకు, బొప్పాయి, వరి, పత్తి పంటలు పాడయ్యూయని చెప్పారు. ఎకరా బొ ప్పాయి నుంచి నెలకు రూ. 2 లక్షలు, ఎకరా అరటి ద్వారా రూ. లక్ష చొప్పున రైతులు ఆదాయం పొందుతున్నారని, అకాలంగా వ చ్చిన తుపాను రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు పంటల బీమా కూడా రెన్యువల్ చే యలేదని, దీంతో పంటల బీమా వర్తించే అవకాశం కూడా లేకుండాపోయిందన్నారు. ఒకవైపు రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ విపత్తు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామన్నారు. అనంతరం ఆయన పంటల న ష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ మండల అధ్యక్షు డు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇటకర్లపల్లి సర్పంచ్ మీసాల రమణ, ఇప్పిలి తిరుమల, సూరిబాబు ఉన్నారు. -
ఆరు నెలల్లో జగన్ పాలన
గుర్ల, న్యూస్‌లైన్ : మరో ఆరు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు అ న్నారు. సోమవారం గోషాడ గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చే రారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు.పార్టీలో ఎవరు చేరాలన్నా.. ధైర్యంగా ముందుకు రావచ్చునని చెప్పా రు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ సీపీయేనని స్పష్టం చేశారు. అనంతరం ఆయన పార్టీలో చేరిన బోగురోతు అప్పలనాయుడు, రౌతు రమణ, మీసాల సంతోష్, రౌతు బంగారునాయుడు, పొందూరు వెంకట సత్యనారాయణ, రౌతు రమణ, మీసాల వెంకట సూరినాయుడుతదితరులకు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు గ్రామంలో పార్టీ జెండాను ఆవి ష్కరించి, గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో ఆ పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాలనాయడు, జిల్లా సభ్యుడు కృష్ణ, మండల కన్వీనర్ సూర్యనారాయణ, ప్రచార కమి టీ కన్వీనర్ వెంకటరమణ, పాల్గ్గొన్నారు.