నెల్లిమర్ల: ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులను వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా అన్నివిధాలా ఆదుకున్నామని వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. తుఫాన్‌వల్ల చనిపోయిన 14మంది కుటుంబాలకు రూ.50వేలు చొప్పున వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. మండలంలోని దన్నానపేట గ్రామానికి చెందిన పంతగడ ప్రతాప్ అనేవ్యక్తి హుద్‌హుద్ తుఫాన్ సమయంలో స్థానిక చెరువు దాటుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతాప్ భార్య వెంకటదుర్గకు వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున పెనుమత్స సాబంశివ రాజు శుక్రవారం రూ.50వేల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాలకు చెందిన కుటుంబాలకు వైఎస్సార్ ఫౌండేషన్‌ద్వారా బియ్యం, వస్త్రాలు అందజేశామని చెప్పారు. అయితే ప్రభుత్వం తరఫున బాధితులకు అందాల్సిన సాయం ఇప్పటిదాకా పూరిస్థాయిలో అందలేదని ఆరోపించారు. జిల్లాలో లక్షలాదిమంది రైతులు పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే ఇప్పటిదాకా రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. రైతుసాధికార సదస్సుల ద్వారా కేవలం ఒక్కోగ్రామానికి ఒకరిద్దరే రైతులను మాత్రమే ఎంపికచేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. టేకు, మామిడి, కూరగాయలు తదితర పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిం చారు. నష్టపరిహారం అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుద్‌హుద్‌వల్ల నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యు డు గదల సన్యాసినాయుడు, రైతువిభాగం కన్వీనర్ సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంటకరమణ, మాజీ ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, పార్టీనేతలు జానా ప్రసా ద్, రేగాన శ్రీనివాసరావు, తర్లాడ దుర్గారావు, మహంతి రామారావు, మీసాల నారాయణరావు, తులసి పాల్గొన్నారు.
హుద్‌హుద్ బాధితులకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం
Published Sat, Dec 20 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement