బాధితులకు అండగా ఉంటాం
పూసపాటిరేగ : తుపాను బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని తిప్పలవలస, చింతపల్లి గ్రామాల్లో పర్యటించారు. తిప్పలవలసలో కోట్లాది రూపాయల విలువైన బోట్లు, వలలు గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బాధితులకు ప్రభుత్వపరంగా సహకారం అందేలా చూస్తామన్నారు. సముద్రానికి దూరంలో ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మత్స్యకార నాయకుడు వాసుపల్లి కన్నయ్య తాత విన్నవించారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి తీవ్ర నష్టాన్ని చూశామని పలువురు ఆయన వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేవీ సూర్యనారాయణ రాజు, విజయనగరం ఏఎంసీ చైర్మన్ అంబల్ల శ్రీరాములనాయుడు, మండల నాయకులు పతివాడ అప్పలనాయుడు, డీసీసీబీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న, మహంతి లక్ష్మణరావు, మలుకుర్తి శ్రీనివాసరావు, సీహెచ్ సత్యనారాయణరాజు, అప్పడు దొర, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
చీపురుపల్లి : హుదూద్ తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోయూరని, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగ ళవారం ఆయన మండలంలోని పేరిపి, ఇటకర్లపల్లి గ్రామాల్లో తుపానుకు పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో ఎన్నడూ ఇంతటి విపత్తు జరగలేదన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ముఖ్యం గా చీపురుపల్లి మండలంలో వేలాది ఎకరాల్లో అరటి, చెరుకు, బొప్పాయి, వరి, పత్తి పంటలు పాడయ్యూయని చెప్పారు.
ఎకరా బొ ప్పాయి నుంచి నెలకు రూ. 2 లక్షలు, ఎకరా అరటి ద్వారా రూ. లక్ష చొప్పున రైతులు ఆదాయం పొందుతున్నారని, అకాలంగా వ చ్చిన తుపాను రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు పంటల బీమా కూడా రెన్యువల్ చే యలేదని, దీంతో పంటల బీమా వర్తించే అవకాశం కూడా లేకుండాపోయిందన్నారు. ఒకవైపు రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ విపత్తు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామన్నారు. అనంతరం ఆయన పంటల న ష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ మండల అధ్యక్షు డు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇటకర్లపల్లి సర్పంచ్ మీసాల రమణ, ఇప్పిలి తిరుమల, సూరిబాబు ఉన్నారు.